Advertisement
Advertisement
Abn logo
Advertisement

చదరంగంలో అలన మీనాక్షి అరుదైన ఘనత

ప్రపంచ చెస్‌ ర్యాంకింగ్‌లో రెండో స్థానం

విశాఖపట్నం (స్పోర్ట్సు), డిసెంబరు 2: చదరంగంలో నగరానికి చెందిన చిన్నారి అలన మీనాక్షి అరుదైన ఘనత సాధించింది. బాలికల అండర్‌-10 వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో నంబరు-2 స్థానాన్ని సాధించింది. ఫిడే రేటింగ్‌ నిబంధనల ప్రకారం అలన మీనాక్షి 1829 స్కోరుతో (పాయింట్ల) వరల్డ్‌ నంబరు-2 స్థానంలోకి దూసుకువెళ్లింది.


2018లో వుమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ (డబ్ల్యుసీఎం) టైటిల్‌ సొంతం చేసుకున్న అలన మీనాక్షి, ఇటీవల ఐరోపాలో జరిగిన పలు ఫార్మాట్ల టోర్నీలలో పాల్గొని అద్భుతమైన ఆటతీరుతో ర్యాంకింగ్‌ మెరుగుపరుచుకున్నది. ఏడేళ్ల ప్రాయం నుంచి చదరంగం బోర్డుపై ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటింది.


ఏషియన్‌ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-7 బాలికల క్లాసిక్‌ స్టాండర్డ్‌ ఫార్మట్‌లో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా పలు అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి పతకాలు అందించింది. శ్రీలంకలో జరిగిన  వుమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ (డబ్ల్యుసీఎం) టోర్నీలో టైటిల్‌ కైవసం చేసుకుని ప్రసంశలు అందుకుంది.

Advertisement
Advertisement