అలంపూర్‌ను సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2021-07-30T04:53:06+05:30 IST

రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్‌ క్షేత్రాన్ని సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గద్వాల సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సభ్యులు, బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

అలంపూర్‌ను సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న నాయకులు

- కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి సీనియర్‌ సిటిజన్‌ ఫోరం విజ్ఞప్తి

గద్వాల, జూలై 29 : రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠం అలంపూర్‌ క్షేత్రాన్ని సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని గద్వాల సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సభ్యులు, బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. డిల్లీలోని టూరిజం భవన్‌లో ఉన్న మంత్రి చాంబర్‌లో గురువారం ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రసాద్‌ స్కీం నిధులతో దేవాలయ సముదాయాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. నడిగడ్డ ప్రాంతంలో గద్వాల సంస్థానాధీశులు అద్భుతమైన దేవాలయాలను నిర్మించారని, వాటిని సంరక్షించాలని కోరారు. జూరాల ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గద్వాల ప్రాంతంలో వైద్యకళాశాల ఏర్పాటుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. జాతీయ రహదారి 44ను కొత్తకోట నుంచి ఆత్మకూర్‌, గద్వాల, మంత్రాయం, గుత్తి, అనంతపురం మీదుగా నిర్మించాలని కోరారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో బీజేపీ నాయకులు వెంకటాద్రిరెడ్డి, అయ్యపురెడ్డి, సీటీజన్‌ ఫోరం నాయకులు మోహన్‌రావు, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-07-30T04:53:06+05:30 IST