Abn logo
Sep 24 2021 @ 23:51PM

వంద పడకల ఆసుపత్రిని త్వరగా పూర్తి చేయాలి

టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ ఎండీ తో మాట్లాడుతున్న ఎమ్యెల్యే అబ్రహాం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా, సెప్టెంబరు 24 : అలంపూర్‌ చౌరస్తాలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం శుక్రవారం టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని కోరారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో శుక్రవారం ఆయనను కలిసి మాట్లాడారు. జాతీయ రహదారి 44కు అనుసంధానంగా ఇప్పటివరకు ఒక్క ఆసుపత్రిని కూడా నిర్మించకపోవడం ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నడిగడ్డలోని ప్రజలు కర్నూల్‌ ఆసుపత్రులకు వెళితే ఆవమానాలకు గురైన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. జాతీయరహదారిపై ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో వైద్యం ఆందక ఎంతో మంది చనిపోయారని విన్నవించారు. వీటన్నీంటిని దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభిం చాలని కోరారు. అందుకు అయన సానుకులంగా స్పందిస్తూ, నెలలోపు పనులు ప్రారంభ మయ్యేలా చూస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.