అల్లాదీన్ అద్భుత దీపం పేరుతో వైద్యునికి రెండుకోట్లు టోకరా!

ABN , First Publish Date - 2020-10-29T11:58:07+05:30 IST

బాగా చదువుకున్నవారు సైతం మాయలు, మంత్రాలకు పడిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది.

అల్లాదీన్ అద్భుత దీపం పేరుతో వైద్యునికి రెండుకోట్లు టోకరా!

మీరట్: బాగా చదువుకున్నవారు సైతం మాయలు, మంత్రాలకు పడిపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్​ జిల్లాలో ఇటువంటి ఉదంతం వెలుగు చూసింది. లండన్​ నుంచి వచ్చిన ఒక డాక్టర్​ను ఇద్దరు మోసగాళ్లు తమ దగ్గర ‘అల్లాద్దీన్​ అద్భుత దీపం ఉందంటూ రూ.2.5 కోట్లకు టోకరా వేశారు. ఖైర్​నగర్​ బ్రహ్మపురి పోలీస్​ స్టేషన్​ సర్కిల్​ ఆఫీసర్​ అమిత్​రాయ్​ తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్​ లాయిక్​ ఖాన్​... సమీనా అనే మహిళకు చికిత్స అందిస్తున్నారు. 


ఈ నేపధ్యంలో డాక్టర్‌కు ఇస్లాముద్దీన్​ అనే మాంత్రికునితో పరిచయం ఏర్పడింది. తన వద్ద ఉన్న అల్లాద్దీన్ అద్భుత దీపం సాయంతో ఎవరి బాధలనైనా నయం చేయగలనని ఇస్లాముద్దీన్​ ఆ వైద్యునికి చెప్పాడు. ఈ మాటలు విన్న ఆ డాక్టర్ తనకు ఆ అద్బుత దీపం కావాలని కోరాడు. ఇందుకోసం విడతల వారీగా ఇస్లాముద్దీన్‌కు రూ. 2.5 కోట్లు చెల్లించాడు. అయితే ఇస్లాముద్దీన్ ఎంతకాలం గడచినా ఆ దీపాన్ని ఇవ్వకపోవడంతో డాక్టర్​ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఇస్లాముద్దీన్​... సమీనాకు భర్తేనని వెల్లడయ్యింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇస్లాముద్దీన్​తో పాటు అతనికి సహకరించిన అనీస్​ను అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరినీ విచారిస్తున్నారు. 

Updated Date - 2020-10-29T11:58:07+05:30 IST