Abn logo
Jul 10 2020 @ 23:18PM

‘బుట్టబొమ్మ..’ సాంగ్ ఖాతాలో తిరుగులేని రికార్డ్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా నటించి మెప్పించిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌ని నమోదు చేసింది. ఈ సినిమా కంటే... ఇందులో ఆడియో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కొడుతూ ఉంది కూడా.  ఆల్బమ్‌లోని ప్రతీ పాటకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘సామజవరగమన’, ‘రాములో రాముల’, ‘బుట్టబొమ్మ’ పాటలు జనాల్లోకి విపరీతంగా ఎక్కేశాయి. అలాగే విజువల్స్ పరంగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ వరల్డ్ వైడ్ క్రేజ్‌‌ని అందుకోవడమే కాకుండా తెలుగులో కనివినీ ఎరుగని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. బన్నీ డ్యాన్స్, పూజా అందంతో కూడిన అభినయం వెరసి పాటను చూపరులు మళ్లీ మళ్లీ చూసేలా వీక్షకులను తెగ మెస్మరైజ్ చేసేస్తుంది. రికార్డ్‌ల మీద రికార్డ్ లను క్రియేట్ చేస్తుంది. యూట్యూబ్‌లో ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్‌కు రికార్డ్ వ్యూస్ వస్తుండటం విశేషం. 


తాజాగా 200 మిలియన్ వ్యూస్ దాటిన ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్.. ఇప్పుడు ఏకంగా 260 మిలియన్ వ్యూస్‌తో తెలుగులో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియో సాంగ్‌గా రికార్డ్‌ను క్రియేట్ చేసుకుంది. అలాగే..1.9 మిలియన్ లైక్స్ వచ్చాయి. మరికొద్ది రోజుల్లో 2 మిలియన్ లైక్స్ మార్క్‌ను ఈ పాట తప్పక చేరుకుంటుంది. కాగా ఈ పాటను ఇంతలా ఆదరిస్తోన్న ఆడియన్స్‌కు థ్యాంక్స్ చెప్తూ.. నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది. అలాగే.. బుట్టబొమ్మ పూజా హెగ్డే, సంగీత దర్శకుడు ఎస్.థమన్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. 


ముఖ్యంగా పూజా ఈ విషయంపై స్పందిస్తూ... ‘‘రికార్డులు మోగిపోతున్నాయ్. ఇంతటి స్థాయిలో ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరంటే నాకు ఎంతో ఇష్టం. ‘బుట్టబొమ్మ’ పాట షూట్ చేయడానికి అల్లు అర్జున్, నేను మా మనసు, ఆత్మ, మధురం, కొన్నిసార్లు కన్నీళ్లు (నేను మాత్రమే) పెట్టాను. ఇప్పుడు ఈ పాటను ఇంత గొప్పగా ఆదరిస్తుంటే అమితానందంగా ఉంది. ఈ పాటలో ప్రతి అంశాన్ని ప్రేక్షకులు ఆస్వాదించడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది’’ అంటూ హీరోయిన్ పూజా తన ట్విట్టర్‌లో పేర్కొంది.


Advertisement
Advertisement
Advertisement