యాదగిరికొండపై క్షేత్రపాలకుడికి ఆకుపూజ

ABN , First Publish Date - 2022-08-17T04:50:29+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజ, స్వామికి నిత్య కైంకర్యాలు, ప్రాకార మండపంలో కోటికుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు.

యాదగిరికొండపై క్షేత్రపాలకుడికి ఆకుపూజ
హరితాకాటేజ్‌ వద్ద జాతీయగీతాన్ని ఆలపిస్తున్న దేవస్థాన, వివిధ శాఖల అధికారులు

యాదగిరిగుట్ట, ఆగస్టు 16 : యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజ, స్వామికి నిత్య కైంకర్యాలు, ప్రాకార మండపంలో కోటికుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. కొండపైన ఆంజనేయస్వామిని పంచామృతాలతో అభిషేకించిన పూజారులు అలంకరించారు. 1,108 తమలపాకులతో సహస్రనామార్చనలు జరిపి ప్రసాదాన్ని నివేదించారు. అదేవిఽధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ క్షేత్రపాలకుడికి విశేషపూజలు కొనసాగాయి. ఇదిలా ఉండగా ప్రధానాలయంలోని స్వయంభువులను, ప్రతిష్టా అలంకార మూర్తులను అభిషేకించి అర్చనలు జరిపారు. అష్టభుజి ప్రాకార మండపంలో హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమ శాస్త్రరీతిలో కొనసాగాయి. ప్రధానాలయ అష్టభుజి ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ కోటికుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఇదిలాఉండగా స్వాతంత్య్ర వజ్రోత్సోవాల్లో భాగంగా ఉదయం 11.30గంటలకు దేవస్థాన సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు ఘాట్‌రోడ్‌లోని హరితాకాటేజ్‌ ఆవరణలో జాతీయగీతాన్ని ఆలపించారు. ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.25,13,861 ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. 

14 రోజుల హుండీ ఆదాయం రూ.కోటి 22 లక్షలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి 14 రోజుల హుండీల ఆదాయం రూ.1.22కోట్లు ఆలయ ఖజానాలో జమయినట్టు ఈవో ఎన్‌.గీతారెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ ఘాట్‌రోడ్డులోని హరితాకాటేజీ సమావేశ మందిరంలో స్వామివారి హుండీల ఆదాయాన్ని దేవస్థాన అధికారుల సమక్షంలో లెక్కించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భక్తజనులు స్వామికి హుండీల ద్వారా సమర్పించిన మొక్కు కానుకలను లెక్కించారు. 14 రోజుల్లో భక్తులు మొక్కుకానుకల రూపంలో రూ.1,22,51,653 నగదు సమర్పించారని, మిశ్రమ బంగారం 101 గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 400 గ్రాములు ఆలయ ఖజానాకు చేకూరినట్టు ఆమె వెల్లడించారు. కాగా, విదేశీ కరెన్సీ రూపంలో 362 అమెరికా డాలర్లు, 45 యూఏఈ దిర్హామ్స్‌, 285 ఆస్ట్రేలియా డాలర్స్‌, 100 ఓమన్‌ బైసాలు, 30 ఇంగ్లాండ్‌ పౌండ్స్‌, 24 సింగపూర్‌ డాలర్స్‌, 30 యూరోలు ఆలయ ఖజానాలో జమయినట్టు తెలిపారు.



Updated Date - 2022-08-17T04:50:29+05:30 IST