రెండున్నర ఎకరాల్లో ఆకుతోట తొలగింపు

ABN , First Publish Date - 2021-04-13T05:36:20+05:30 IST

మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన పీరా అనే రైతు రెండున్నర ఎకరాల్లో ఆకుతోట దెబ్బతినడంతో సోమవా రం తొలగించారు.

రెండున్నర ఎకరాల్లో ఆకుతోట తొలగింపు
ఆలమూరులో తొలగించిన ఆకుతోట

  1. రూ.5 లక్షలు నష్టం 


రుద్రవరం, ఏప్రిల్‌ 12: మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన పీరా అనే రైతు రెండున్నర ఎకరాల్లో ఆకుతోట దెబ్బతినడంతో సోమవా రం తొలగించారు. కౌలు రూపం లో రూ.1.40 లక్షలు, పెట్టుబడికి రూ.3.60 లక్షలు వెచ్చించాడు. ఇటీవల కురిసిన వర్షాలు, పొగమంచు దెబ్బకు, తెగుళ్ల దాడికి ఆకు తీగలకు సపోటుగా ఉన్న  చెట్లు ఎండిపోయాయి. ఆకు తీగలకు నీడనిచ్చే ఔష చెట్లు ఎండిపోవడంతో తీగలు కూడా దెబ్బతిన్నాయి. తమలపాకులు చేతికందే సమయంలో తోట దెబ్బతింది. దీంతో రైతుకు రూ.5 లక్షలు నష్టం వాటిల్లింది. 


రూ.5 లక్షలు నష్టపోయా

రెండున్నర ఎకరాల్లో ఆకుతోట సాగు చేసి రూ.5 లక్షలు నష్టపోయా. తుఫాను వర్షాలు, మొగలి దెబ్బకు నీడనిచ్చే ఔష చెట్లు ఎండిపోయి ఆకుతోటలు దెబ్బతిన్నాయి. చేసిన కష్టమంతా పుడమి పాలైంది. 

- పీరా, రైతు, ఆలమూరు


Updated Date - 2021-04-13T05:36:20+05:30 IST