అక్తర్ ఆల్‌టైం ఎలెవెన్.. నలుగురు ఇండియన్స్.. మరో నలుగురు..

ABN , First Publish Date - 2021-07-18T06:14:39+05:30 IST

రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ తాజాగా తన ఆల్‌టైం క్రికెట్ జట్టును ప్రకటించారు. క్రికెటర్లు చాలా మంది..

అక్తర్ ఆల్‌టైం ఎలెవెన్.. నలుగురు ఇండియన్స్.. మరో నలుగురు..

ఇస్లామాబాద్: రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ తాజాగా తన ఆల్‌టైం క్రికెట్ జట్టును ప్రకటించారు. క్రికెటర్లు చాలా మంది తమ ఆల్ టైం జట్లను ప్రకటిస్తున్నారు కదా..! అందేలో కొత్తగా ఏముంటుంది..? అంటారా..! కచ్చితంగా ఉంది. అక్తర్ ప్రకటించిన జట్టులో ఏకంగా నలుగురు భారత క్రికెటర్లకు స్థానం కల్పించాడు. అదే ఇప్పుడు భారత క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పాకిస్తాన్ ఆటగాడైనా భారత ఆటగాళ్ల ప్రతిభను గౌరవించి నలుగురిని తన ఆల్‌టైం జట్టులో చేర్చడం నిజంగా గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. అయితే అక్తర్ తన జట్టులో పాకిస్తాన్ ఆటగాళ్లను కూడా నలుగురికి స్థానం కల్పించడం విశేషం.


ఇక అక్తర్ జట్టును పరిశీలిస్తే.. ఓపెనర్లుగా టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్, విండీస్ మాజీ ఆటగాడు జీ గ్రీనిడ్జ్‌లను ఎంపిక చేశాడు. వన్ డౌన్‌లో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమాన్ ఉల్ హక్‌, 4వ స్థానంలో పాకిస్తాన్ ఒకప్పటి సూపర్ ఓపెనర్ సయీద్ అన్వర్, 5వ స్థానంలో టీమిండియి మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ, 6వ స్థానంలో ఆసీస్ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, 7వ స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, 8వ స్థానంలో పాకిస్తాన్ లెజెండరీ ఆల్‌రౌండర్ వసీం అక్రం, 9వ స్థానంలో పాక్ మాజీ లెజెండ్ వకార్ యూనిస్, 10వ స్థానంలో టీమిండియా హాల్ ఆఫ్ ఫేమ్, వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఆఖరుగా ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వాట్సన్‌ ఉన్నారు. అయితే ఈ జట్టులో కొందరు ఆటగాళ్ల కూర్పులో వారు ఎక్కవగా ఆడిన స్థానాల్లో కాకుండా వేరు వేరు స్థానాల్లో ఉంచడం గమనార్హం.

Updated Date - 2021-07-18T06:14:39+05:30 IST