Abn logo
Sep 25 2020 @ 01:32AM

‘పృథ్వీరాజ్‌’ కోసం అక్షయ్‌ సిద్ధం

Kaakateeya

ప్రస్తుతం కరోనా టైమ్‌లోనూ ఖాళీలేకుండా షూటింగ్‌ల్లో పాల్గొంటున్న హీరో ఎవరంటే బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమారే గుర్తుకొస్తారు. ప్రస్తుతం ఆయన స్కాంట్లాండ్‌లో ‘బెల్‌బాటమ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అక్కడి నుంచి తిరిగిరాగానే విశ్రాంతి తీసుకోకుండా ‘పృథ్వీరాజ్‌’ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటారు. 12వ శతాబ్దానికి చెందిన చాహామనా రాజవంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పృథీరాజ్‌’. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వంలో నిర్మాత ఆదిత్యాచోప్రా ఈ చిత్రాన్ని భారీఎత్తున తెరకెక్కిస్తున్నారు.  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌. లాక్‌డౌన్‌ కారణంగా మేలో ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్‌ను తిరిగి కొనసాగించడానికి అక్షయ్‌ అంగీకరించడంతో చిత్ర యూనిట్‌  సిద్ధమవుతోంది. ‘పృథ్వీరాజ్‌’ సినిమా కోసం గతంలో వేసిన ప్యాలెస్‌ సెట్‌ వర్షాలకు దెబ్బతినడంతో వచ్చేవారం నుంచి మళ్లీ కొత్త సెట్‌ వేస్తున్నారు.

Advertisement
Advertisement