May 30 2021 @ 16:42PM

మ‌రోసారి దొడ్డ మ‌న‌సు చాటుకున్న అక్ష‌య్‌

దేశం ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న‌ప్పుడు వీలైనంత సాయాన్ని అందించే సినీ సెల‌బ్రిటీల్లో అక్ష‌య్ కుమార్ ముందు వ‌రుస‌లో ఉంటారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా తొలిసారి లాక్డౌన్ విధించిన‌ప్పుడు ప్ర‌ధాని స‌హాయ నిధికి, అక్ష‌య్ కుమార్ పాతిక కోట్ల రూపాయ‌ల‌ను విరాళం ఇచ్చి పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. అలాగే ముంబై పోలీస్ ఫౌండేష‌న్ కోసం రెండు కోట్ల రూపాయ‌ల‌ను, క‌జిరంగా రెస్క్యూ ఆఫ‌రేష‌న్ కోసం అస్సాం ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కోటి రూపాయ‌ల‌ను విరాళ‌మిచ్చారు అక్ష‌య్‌. ఇక కొవిడ్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో గౌతం గంభీర్ ఫౌండేష‌న్‌కు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ను అందించారు. అలాగే అక్ష‌య్ స‌తీమ‌ణి ట్వింకిల్ ఖ‌న్నాఅయితే బాలీవుడ్ డాన్స‌ర్స్‌కు రేష‌న్ అందించింది. ఇప్పుడు అక్ష‌య్ మ‌రో అడుగు ముందుకేసి, మూవీ స్టంట్ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్‌లోని 550 మంది స‌భ్యుల‌కు యాక్సిడెంట‌ల్‌, మెడిక‌ల్ పాల‌సీల‌ను గ‌త ప‌దేళ్లుగా చెల్లిస్తూ వ‌స్తున్న అక్ష‌య్ ఈ ఏడాది కూడా త‌న బాధ్య‌త‌గా స‌ద‌రు పాల‌సీల‌కు అయ్యే మొత్తాన్ని చెల్లించి త‌న దొడ్డ మ‌న‌సు చాటుకున్నార‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అప్రిషియేట్ చేస్తున్నాయి. 

Bollywoodమరిన్ని...