ఏటా ఎక్కువ చిత్రాల్లో నటించే బాలీవుడ్ నటుల్లో అక్షయ్‌కుమార్ ముందు వరుసలో ఉంటారు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో ‘రామసేతు’ చిత్రాన్ని అక్షయ్ ప్రకటించారు. తమిళ ‘జిగర్తండా’కు హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘బచ్చన్‌పాండే’ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు అక్షయ్ మరో చిత్రాన్ని అంగీకరించారు. గతంలో ఆయన నటించిన ‘మిషన్‌మంగళ్’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జగన్ శక్తి కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తారు. అక్షయ్‌కుమార్ సొంత బేనర్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్ట్వర్క్ జరుగుతోంది. మిషన్ మంగళ్ చిత్రం షూటింగ్ 28 రోజుల్లో పూర్తి చేసిన విధంగానే ఈ చిత్రం షూటింగ్‌ను 38 రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆఖరుకు ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.