కూలీగా మారిన అక్షయ్ కుమార్ భార్య Twinkle Khanna

ట్వింకిల్ ఖన్నా అంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అని అందరికి గుర్తుకొస్తుంది. అలనాటి తార డింపుల్ కపాడియా కూతురు, అక్షయ్ కుమార్ భార్యగా బీ టౌన్‌లో అందరికి తెలుసు. ఆ నటి కూలీగా మారింది. లగేజీ బ్యాగులను మోసింది. అందుకు కారణం  తెలియాలంటే ఈ స్టోరీని చదవాల్సిందే..


ట్వింకిల్ ఖన్నా ఒక పుస్తకానికి సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఆ పుస్తకం పేరు ‘‘ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా’’. భావన సొమయ్య అనే రచయిత్రి ఆ పుస్తకాన్ని రాసింది. ట్వింకిల్ ఖన్నా, డింపుల్ కపాడియాల మధ్య చోటు చేసుకున్న వివిధ ఆసక్తికర సంగతులను ఆ పుస్తకంలో రచయిత్రి వివరించింది. 


‘‘ ఎయిర్‌పోర్టులో 1994లో ట్వింకిల్ ఖన్నా, డింపుల్ కపాడియా ప్లైట్ కోసం ఎదురు చూస్తుండగా నేను వారిని కలిశాను. ఆ సమయంలో ట్వింకిల్ తన భుజాల మీద లగేజీని మోస్తుంది. స్టార్ హీరోయిన్‌గా మారిన తర్వాత నీకు స్వాతంత్ర్యం పోతుంది. నువ్వు నటివైతే నీ చుట్టూ బాడీగార్డులు ఉంటారు ’’ అని భావన సొమయ్య చెప్పింది. ‘‘ భవిష్యత్తు గురించి నాకు తెలియదు. ప్రస్తుతం నా తల్లికి నేను కూలీగా మారాను. ఆమెకు చెకింగ్ బ్యాగులు ఇష్టం ఉండదు. విమానం ల్యాండ్ అయినంత అనంతరం వెయిట్ చేయడం ఆమెకు నచ్చదు. అందువల్ల భారీ బరువులను మోస్తూ నేను కూలీగా మారాను ’’ అని ట్వింకిల్ ఖన్నా సమాధానం చెప్పింది. 


Advertisement

Bollywoodమరిన్ని...