Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 10:03:44 IST

Raksha Bandhan Twitter review: అక్షయ్ కుమార్ మూవీ ఎలా ఉందంటే..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఈ నటుడు ఏడాదిగా నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఈ ఏడాది ఈయన నటించిన ‘బచ్చన్ పాండే(Bachchhan Panday)’, ‘పృథ్వీరాజ్ (Samrat Prithviraj)’ విడులయ్యాయి. అవి అంతగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘రక్షాబంధన్(Raksha Bandhan)’. భూమి పడ్నేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ (Aanand L Rai) దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్, కలర్స్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ సంయుక్తంగా నిర్మించి ఈ చిత్రం ఈ రోజు (ఆగస్టు 11)న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.


ఇప్పటికే ఈ మూవీ ప్రిమీయర్ షోలు చూసిన పలువురు నెటిజన్లు ట్విట్టర్ రివ్యూలు రాసుకొచ్చారు. అందులో ‘అక్షయ్ కుమార్‌కి చాలా సినిమాల తర్వాత బ్లాక్‌బస్టర్ దక్కింది. ఆయన కెరీర్‌లో మంచి నటనని కనబరిచారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం అదిరిపోయింది. ఈ మూవీని ఖచ్చితంగా మిస్ అవ్వకండి’ అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. అక్షయ్ కుమార్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం ఇది. ఆనంద్ ఎల్ రాయ్ 2022లోనే బెస్ట్ మూవీని తీశాడు. కథ, ఎమోషన్, కామెడీ అన్ని సమపాళ్లలో కలిపిన విండు ఈ చిత్రం అని చెబుతున్నారు. కొందరైతే ఐదుకి 4.5 స్టార్ల రేటింగ్ సైతం ఇస్తున్నారు.






Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement