Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 13 Aug 2022 18:02:22 IST

Raksha Bandhan Collections: అక్షయ్ కుమార్ రక్షా బంధన్‌కు మరీ ఇంత తక్కువ కలెక్షన్లా..? మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌లో ఏడాదికీ మూడు, నాలుగు సినిమాలు విడుదల చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేస్తుంటాడు. అంతే స్పీడ్‌లో సినిమాలను విడుదల చేస్తుంటాడు. అక్కీ నుంచి వచ్చిన చివరి మూడు సినిమాలు దారుణంగా పరాజయం పాలయ్యాయి. ‘బెల్ బాటమ్’, ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. అక్షయ్ నుంచి తాజాగా వచ్చిన మూవీ ‘రక్షా బంధన్’ (Raksha Bandhan). భూమి ఫడ్నేకర్ (Bhumi Pednekar) హీరోయిన్‌గా నటించింది. ఆనంద్ ఎల్.రాయ్ (Aanand L. Rai) తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. 


‘రక్షా బంధన్’ మొదటి రోజు రూ. 10కోట్ల కంటే తక్కువ వసూళ్లను రాబట్టింది. సెలవు రోజున విడుదలైనప్పటికీ ఈ సినిమా రూ. 8.20కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే కొల్లగొట్టింది. చిత్రాన్ని వీక్షించడానికీ ప్రేక్షకులు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. ఫలితంగా ఎగ్జిబిటర్స్ మొదటి రోజే 1000షోస్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో ఆ కలెక్షన్స్ రెండో రోజు మరింత తగ్గాయి. రూ. 6.4 కోట్ల వసూళ్లను మాత్రమే చిత్రం రాబట్టింది. ఈ సినిమా మొత్తంగా రూ.14.6కోట్ల కలెక్షన్స్‌ను మాత్రమే సాధించింది. ‘రక్షా బంధన్’ కు మాస్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మెట్రో ప్రాంతాల్లోని ప్రేక్షకుల నుంచి మాత్రం ఆదరణ కరవైంది. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement