Abn logo
Mar 29 2020 @ 21:25PM

హాస్పటల్‌కి వెళ్లింది అందుకే..: అక్షయ్ భార్య

కరోనా విషయంలో దేశ, రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడికక్కడికి కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. భారత్‌కు సంబంధించి మహారాష్ట్రలో ఈ కరోనా మహమ్మారి ఉదృతి ఎక్కువగా ఉంది. ఎవ్వరూ బయటికి రావడానికి లేని సమయంలో బాలీవుడ్ స్టార్ కపుల్ అక్షయ్ కుమార్, ట్వింకిట్ ఖన్నా.. కారులో ముంబై రోడ్లపై దర్శనమిచ్చారు. అంతా కర్ఫ్యూ వాతావరణం ఉంటే వీరిద్దరూ అలా కారులో వెళ్లడం ఏమిటనే అనుమానాలు రావచ్చు. అయితే వారు వెళ్లింది హాస్పటల్‌కి. ఈ టైమ్‌లో హాస్పటల్ అంటే అందరికీ మరో రకంగా కూడా అనుమానాలు రావడం సహజమే. అలా అనుమానించే వారందరికీ ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. 


ముఖానికి మాస్క్‌తో అక్షయ్ కుమార్ కారు డ్రైవ్ చేస్తున్న వీడియోని షేర్ చేసిన ట్వింకిల్ ఖన్నా.. ‘‘ఎడారిగా మారిన రోడ్డు మార్గంలో హాస్పటల్ నుంచి తిరిగివస్తున్నాం.. భయపడొద్దు.. నేను హాస్పటల్ అనగానే అందరూ ఏం ఆలోచిస్తారో తెలుసు.. అయితే నేను వెళ్లింది కాలుకు బ్యాండేజ్ వేయించుకోవడానికి మాత్రమే. నేను బకెట్ తన్నేస్తానని అనుకుంటున్నారేమో.. ఎందుకంటే నేనిప్పుడు ఏ బకెట్‌ను తన్నలేను..’’ అంటూ ఇన్ డైరెక్ట్‌గా నేను వెళ్లింది కరోనా వైరస్ టెస్ట్‌కు కాదు.. కాలికి కట్టు వేయించుకునే టెస్ట్‌కు అంటూ కామెడీగా సెలవిచ్చింది.


Advertisement
Advertisement
Advertisement