హిందీతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటించిన హీరోయిన్ ట్వింకిల్ ఖన్నాను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ట్వింకిల్ కంటే ముందు మరో అమ్మాయితో అక్షయ్ డేటింగ్ చేశాడట. అయితే ఆ అమ్మాయి అక్షయ్‌కు బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయిందట. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన అక్షయ్ తన తొలి ప్రేమ ముచ్చట్లను అభిమానులతో పంచుకున్నాడు.
`టీనేజీలో ఓ అమ్మాయితో నాలుగైదు సార్లు డేటింగ్‌కు వెళ్లాను. సినిమాలకు, రెస్టారెంట్లకు తిరిగాం. అంతా సంతోషంగా సాగిపోతోందనుకున్న సమయంలో ఉన్నట్టుండి ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పేసింది. నేను రొమాంటిక్‌గా లేకపోవడం వల్లే ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం, చేతిలో చెయ్యేసి నడవడం వంటి పనులు నేను చేయలేదు. దాంతో ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. నాకు మొదటి నుంచి కాస్త సిగ్గు ఎక్కువ. అదే సమస్యగా మారింద`ని అక్షయ్ చెప్పాడు.