గీతామందిర్ రోడ్డులో ఆక్రమణలు తొలగిస్తున్న నగర పంచాయతీ సిబ్బంది
ఉయ్యూరు, మే 17 : పట్టణంలో రోడ్లు ఆక్రమించి ప్రజలకు అసౌకర్యం కలిగిం చేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ సీహెచ్ సత్యనారాయణ అన్నారు. స్థానిక శివాలయం రోడ్డునుంచి గీతామందిర్ వరకు రోడ్డుపక్కన ఆక్రమించి వ్యాపారాలు చేస్తూ వాహనాల రాకపోకలకే కాక పాదాచారులకు సైతం ఇబ్బంది కలిగిస్తున్నట్టు పట్టణ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల మేరకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను వార్డు సచివాలయ, శానిటరీ సిబ్బందితో మంగళవారం ప్రత్యేకడ్రైవ్ నిర్వహించి తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్లసైడ్‌లను ఆక్రమించి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న వారిని ఉపేక్షించమని హెచ్చరించారు.