వ్యవసాయ క్షేత్రం అక్రమాలపై చర్యలేవీ..?

ABN , First Publish Date - 2021-04-26T05:45:48+05:30 IST

కణేకల్లు వ్యవసాయ క్షేత్రంలో అక్రమాల ఆ రోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై చర్య లు తీసుకోవడంలో జాప్యమవుతోంది. వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనరేట్‌ ఉన్నతాధికారులు మీనమేశాలు లెక్కిస్తుండటమే ఇందు కు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వ్యవసాయ క్షేత్రం అక్రమాలపై చర్యలేవీ..?

నాలుగు నెలల క్రితమే కమిషనరేట్‌కు నివేదికలు

రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల మీనమేశాలు

నేటికీ స్పందన కరువు

కలెక్టర్‌ జోక్యం చేసుకుంటేనే కొలిక్కి..!

అనంతపురం వ్యవసాయం, ఏప్రిల్‌ 25: కణేకల్లు వ్యవసాయ క్షేత్రంలో అక్రమాల ఆ రోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై చర్య లు తీసుకోవడంలో జాప్యమవుతోంది. వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనరేట్‌ ఉన్నతాధికారులు మీనమేశాలు లెక్కిస్తుండటమే ఇందు కు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా కణేకల్లు వ్యవసాయ క్షేత్రంలోనే తిష్టవేసిన ఓ అధికారి అంతాతానై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవసాయ శాఖ కమిషనర్‌కు అందిన ఫిర్యాదుల మేరకు కణేకల్లు వ్యవసాయ క్షేత్రం పై వచ్చిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ అధికారులతో విచారణ చేయించారు. నాలుగు మాసాల క్రితమే అక్రమాలపై జేడీఏ కార్యాలయం నుంచి వ్యవసా య శాఖ కమిషనర్‌కు నివేదికలు పంపారు. క్షేత్రంలో పనిచేస్తున్న ఓ అధికారి భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అక్కడ పనిచేసే ఓ డైలీ లేబర్‌కు ప్రాధాన్యతనిచ్చి, అతడికే అన్ని పనులు అప్పగించి, తన పని చక్కబెట్టుకున్నట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా క్షేత్రంలోని కొన్ని ఎకరాలను బయటి వ్యక్తులకు కౌలుకు ఇచ్చి, సొమ్ము చేసుకున్నారన్న విమర్శలు లే కపోలేదు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యవసాయ ఉన్నతాధికారి అండతో నిబంధనల అతిక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు బ లంగా వినిపిస్తున్నాయి. పలు రకాల రికార్డు లు సక్రమంగా నిర్వహించకపోవడంతోపాటు వరి బాగా పండినా సరిగా పండలేదంటూ లెక్కలు చూపినట్లు తెలిసింది. విచారణ బృందం తన నివేదికల్లో ఇదే అంశాలను పొందుపర్చినట్లు సమాచారం.


స్పందన కరువు

విచారణ బృందం ఇచ్చిన సమాచారం మేర కు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సద రు అధికారిని సస్పెండ్‌ చేయడంతోపాటు నిధుల లెక్క తేల్చేలా చర్యలు తీసుకోవాలని నివేదికల్లో పొందుపర్చారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు నివేదికలపై ఇప్పటి దాకా స్పందించకపోవడం గమనార్హం. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాస్థాయి ఉ న్నతాధికారి నివేదికలు పంపడంతోనే సరిపెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కలెక్టర్‌ దృ ష్టికి అక్రమాల వ్యవహారాన్ని తీసుకువె ళ్ల డంతోపాటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను సం ప్రదించి, చర్యలు తీసుకునేలా ప్రయత్నించట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చర్య లు తీసుకోవడంలో జాప్యంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి రాజకీయంగా ఉన్నతాధికారులకు ఒత్తిడి తెప్పించి, చర్యల నుం చి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తె లిసింది. ఇందుకు స్థానికంగా కొందరు రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్య క్తుల సహకారం తీసుకున్నట్లు సమాచారం. 

ఈ పరిస్థితుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా..? నామమాత్రపు హె చ్చరికలతో సరిపెడతారా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల జాప్యం నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకుంటేనే కణేకల్లు వ్యవసాయ క్షేత్రంలో అక్రమార్కులపై వేటుపడే అవకాశం ఉందన్న వాదనలున్నాయి. మరి ఏ మేరకు స్పందిస్తారో వేచిచూడాల్సిందే.

Updated Date - 2021-04-26T05:45:48+05:30 IST