Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

లేడీస్‌ ఫాలోయింగ్‌ కిక్కిస్తుంది

twitter-iconwatsapp-iconfb-icon
లేడీస్‌ ఫాలోయింగ్‌ కిక్కిస్తుంది

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున సినిమాల్లోకి ఎందుకొచ్చారు.. ఆయన మొదటి సినిమా చూసి తండ్రి నాగేశ్వరరావు ఏమన్నారు.. ఆయన కుమారుడికి హీరోయిన్ల విషయంలో ఇచ్చిన సలహా ఏంటి.. బాలయ్యతో కలిసి ఎప్పుడు నటించబోతున్నారు.. ఇప్పుడున్న హీరోల్లో ఎవరికి ఎన్ని మార్కులేస్తారు.. శిరిడీసాయికి పునాది ఎప్పుడు పడింది.. రాజకీయ నాయకులతో క్లోజ్‌నెస్‌కి కారణమేంటి.. వంటి ప్రశ్నలకు 29-8-11న జరిగిన ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో సవివరమైన సమాధానాలిచ్చారు. ఆ వివరాలు...


మీరేమో మన్మధుడు. మీ నాన్నగారేమో ఎవర్‌గ్రీన్‌ హీరో.. మరి మీ అబ్బాయి?

నేను నాగచైతన్య అనిపేరు పెట్టాను. ఫ్యాన్స్‌ ఇంకా ఏ పేరూ పెట్టలేదండీ..


మీ ఫ్యామిలీలో అందరూ ఎవర్‌గ్రీన్‌ హీరోసే కదా దీనికి కారణం ఎవరు?

నాన్నగారేనండి. ఆయన క్రమశిక్షణతో పెంచిన విధానం. భగవంతుని ఆశీస్సులు


మీ ఇంట్లో అందరికీ లేడీ ఫాలోయింగ్‌ ఎక్కువ కదా దీనికి ఎలా ఫీలవుతారు?

ఆడవాళ్ల ఫాలోయింగ్‌ మంచి కిక్కిస్తుంది.


మీ తొలి సినిమా ‘విక్రమ్‌’ చూసినప్పుడు నాగార్జున ఇంత గ్లామర్‌ హీరో అవుతాడని ఎవరైనా అనుకున్నారా?

నేనే అనుకోలేదండి.


మీకు వ్యాపారమంటే బాగా ఇంట్రెస్ట్‌ ఉండేది కదా. మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు?

అమెరికాలో ఇంజనీరింగ్‌ చేసి ఏదో ఇండస్ట్రీ పెట్టాలనుకునే ఇండియాకు వచ్చాను. ఆ సమయంలో నాన్నగారు సినిమాలు ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. నా ఇంట్రెస్ట్‌ చూసి సినిమాల్లో నటిస్తావా అని అన్నయ్య నన్నడిగాడు. ఈ విషయం నాన్నగారికి చెప్పాను.


టాప్‌ హీరోల కొడుకులందరికీ వరుసగా పెళ్లిళ్లవుతున్నాయి. మీ వాడికి?

అది కంప్లీట్‌గా వాడిష్టమే.


మీ ఇద్దరి మధ్య లేడీస్‌ గురించి కూడా జెలసీ రావచ్చుగా?

లేదండీ.. వాడు ఇంకా కుర్రాడండీ.. జీవితాలతో ఆడుకోవద్దని మాత్రమే సలహా ఇచ్చా...


కొత్త హీరోయిన్లు హీరోలను ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తారంటారు? మీ అబ్బాయికి మీరేమైనా సలహాలు ఇచ్చారా?

డోంట్‌ ప్లే విత్‌ సంబడీస్‌ లైఫ్‌ అని మాత్రమే సలహా ఇచ్చాను.


విక్రమ్‌లో నటించినప్పుడు మీ నాన్నగారు మీ నటన గురించి ఏమన్నారు?

నా మొదటి సినిమా కన్నా నీ మొదటి సినిమాలో బాగా చేశావురా అన్నారు. అన్నమయ్య తర్వాత నా పేరు నిలబెడుతున్నావన్నారు.


ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ కలిసి నటించారు. మీరు బాలకృష్ణ కలిసి నటించడంలేదే?

నాకూ చేయాలనుంది. ఈ మధ్య బాలయ్యను కలిసినపుడు అదే విషయం మాట్లాడుకున్నాం. శ్రీరామరాజ్యం అయ్యాకా వర్కవుట్‌ చేద్దామనుకున్నాం. ఈ లోగా తారక్‌ (జూ.ఎన్టీఆర్‌) ఫోన్‌ చేసి నాగచైతన్యతో కలిసి గుండమ్మ కథ రీమేక్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నామని చెప్పాడు. వాళ్ల ప్రాజెక్టు సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా.


మీ కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుంది కదా?

మేమూ ఎదురుచూస్తున్నాం. అయితే, ఏ సినిమా చేయాలో బాలయ్యకే వదిలేశాను.


ఇండస్ర్టీకి వచ్చి పాతికేళ్లు గడిచింది కదా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తోంది?

చాలా ఆనందంగా ఉన్నాను. నటుడిగా కన్నా మనిషిగా చాలా సంతృప్తి చెందాను.


అమలగారితో మీ మ్యారేజికి ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారు. అమలా? మీరా?

నేనే. ఆ ప్రపోజల్‌ స్టేజీ రావడానికి ఐదారేళ్లు పట్టింది. నేను చెప్పగానే ఆనందంతో ఏడ్చేసింది. నాన్నగారు మొదట్లో కొంచెం వ్యతిరేకించారు.


పెళ్లి తర్వాత మీ ఇద్దరి మధ్య ఏమైనా తేడాలొచ్చాయా?

ఆమె ప్రపంచాన్నంతా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఒత్తిడిని ఇంటికి కూడా తీసుకొస్తుంది. ఈ ఒక్క విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో తేడా రాదు.

ఆవిడ సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉండడం కూడా మీకు కలిసొచ్చేదే కదా? ఎందుకంటే మీరు మన్మథుడు కదా?

అడుగుతారని తెలుసు. కాలేజీ రోజుల నుంచి నేను అమ్మాయిలతో చాలా స్నేహంగా ఉండేవాడిని. అందుకే నాతో హీరోయిన్లందరూ చాలా సరదాగా ఉంటారు. అమలకు నా మీద చాలా నమ్మకం. అందుకనే రూమర్స్‌పై ఏ విధమైన ప్రశ్నలు అడగదు.


టబూ విషయంలో చాలా దూరం వె ళ్లారని ప్రచారంలో ఉంది?

అలాంటిదేం లేదండి. ఆమె నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అంతే. ఆమె హైదరాబాద్‌ వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. టబూకు హైదరాబాద్‌లో ఇంటిని అమలే దగ్గరుండి కట్టించింది.


మీ మీద ప్రేమతోటే ఆమె పెళ్లి కూడా చేసుకోలేదంటారు?

ఆమె చాలా ఎమోషనల్‌ పర్సన్‌. నేను తనకో సైకియాట్రిస్ట్‌ను. ఏ ప్రాబ్లం వచ్చినా తెల్లవారుజామున నాకు ఫోన్‌ చేస్తుంటుంది. నేను ఏదోటి చెప్పి ఓదారుస్తాను.


టాల్‌ హీరోయిన్స్‌ను మీరు ఎక్కువగా రికమండ్‌ చేస్తారంటారు?

నేను పొడుగు కాబట్టి. జోడి బాగుంటుందని.


అనుష్క విషయంలో మీ గురించి మాట్లాడారు. చైతన్య గురించి మాట్లాడారు?

అన్యాయం కదండి. అసహ్యం కదండి. సొసైటీ ఎలా డీగ్రేడ్‌ అయిపోతోందో..


చైతన్య వల్ల మీతో కలిసి చేసేందుకు హీరోయిన్లు ముందుకు రావడం లేదంటారు?

హీరోయిన్లు కూడా యువకులతో నటించేందుకు ముందుకొస్తారు.


అఖిల్‌ అరంగేట్రం ఎప్పుడు?

ఇంకా ఏమీ అనుకోలేదు. వాడు క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. సినిమాలపైనా ఇంట్రెస్ట్‌ ఉంది. చైతన్య, అఖిల్‌ క్లోజ్‌గా ఉంటారు. ఈ విషయంలో నేను చాలా లక్కీ.


ఇప్పుడు షిరిడీ సాయిబాబా. అసలు ఇది ఎట్లా సాధ్యమవుతోంది?

నేను సండే ఫ్రెండ్స్‌తో కలిసి రెండు బీర్లు తాగి. నాటుకోడి కూర తిని ఎంజాయ్‌ చేస్తా. అలాంటి సమయంలో షిరిడీ వెళ్లాలని నాకు ఆలోచన వచ్చింది. అక్కడికెళ్లి తిరిగొచ్చేప్పటికి రాఘవేంద్రరావుగారు షిరిడీ సాయిబాబా సినిమా తీస్తున్నామన్నారు.


రాఘవేంద్రరావుగారంటే యాపిల్‌, ద్రాక్ష... మరి షిరిడీ సాయిబాబాలో ఎలా?

ఈ సినిమాలో నాకు హీరోయిన్‌ లేదు కాబట్టి. యాపిల్స్‌ నేను తింటాను. అన్నమయ్య తర్వాత ఐదారు సినిమాలు దెబ్బతిన్నాయి.


ఆర్కే: మీరు ఆడపిల్లను ఎందుకు వద్దనుకున్నారు?

నాగ్‌: వద్దనుకోవడం కాదు. అమల ప్రెగ్నెన్సీలో ఆఖరి రెండు నెలలు అమెరికాలో ఉంచాను. అక్కడ స్కానింగ్‌ చేసి చూసి ఆడపిల్లని చెప్పారు. అప్పుడు ఆడపిల్లల కోసం ఫ్రాక్స్‌ కొన్నాను. టికెట్‌ కూడా నిఖిత పేరుపై బుక్‌ చేశాను.


మీకు ఇక్కడి హీరోయిన్లు నచ్చరా?

ఇక్కడివాళ్లు ఇండస్ట్రీకి రావడానికి ఇష్టపడడం లేదు.


మీరు సీఎంలతో కూడా మంచి రిలేషన్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తారు?

నాకు ఇష్టమున్నా లేకున్నా. వారు ప్రజలచేత ఎంపిక చేసుకోబడ్డవారు. అందుకే ఏ ప్రభుత్వ కార్యక్రమాలకైనా సాయం (పబ్లిసిటీ) చేస్తాను.


పాలిటిక్స్‌లోకి వెళ్లరా. మీ నాన్నగారికి చాలాసార్లు రాజ్యసభకు పంపుతామన్నా ఆయన కూడా వెళ్లలేదు?

నాకు పాలిటిక్స్‌ ఇష్టం లేదు.


ఇప్పుడు వర్మతో మీ రిలేషన్‌ బాగానే ఉందా?

బాగానే ఉంది. అప్పుడు నాకు ఫోన్‌ చేసేవాడు. ఇప్పుడు చైతన్యకు చేస్తున్నాడు.


కృష్ణవంశీ, మీరు, నాగేశ్వరరావుగారు, చైతన్య కలిసి చేసే కథ సిద్ధం చేశారట?

అవును. కానీ సెకండాఫ్‌ నాకు నచ్చలేదు. మళ్లీ చేసుకొస్తానన్నాడు.


ఇప్పుడు వస్తున్నవారిలో అంత కమిట్‌మెంట్‌ ఉందంటారా?

చైతన్యకు నా కన్నా ఎక్కువ ఫోకస్‌. అల్లు అర్జున్‌ అంతే. రవితేజ బాగా కష్టపడతాడు.


ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కదా?

అవును. నిజమే. మీ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్‌ చూశా. అది నిజమే. కింద పడనివ్వండి. అప్పుడు తప్పకుండా పైకి లేస్తుంది.


ఇప్పట్లో ఒక సినిమాకు రూ.30, 40 కోట్లు పెడుతున్నారు?

మార్కెట్‌ రూ.20 కోట్లుంటే రూ.30 కోట్లతో డైరెక్టర్‌ సినిమా తీయడమేంటండి బుద్ధి లేకుండా. ఇప్పుడున్న దర్శకుల్లో రాజమౌళిని అభినందిస్తా.

శోభన్‌బాబు భూమిని నమ్ముకొన్నారు. ఆ విషయంలో మీకు ఆయనకు పోలిక ఉందంటారు?

నాకు అనుకున్నంత భూములు లేవు. అది ప్రచారమంతే. భవిష్యత్తులో నచ్చితే కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తాను.


మీకు లౌక్యం ఎక్కువంటారు?

ఒకప్పుడు కాదండి. పరిస్థితులను బట్టి నేర్చుకున్నాను.


యాక్టింగ్‌ స్కూలు పెట్టాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?

మనం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాం గనుక. ఇక్కడ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పెట్టాలని నాన్నగారు అన్నారు.


మీకు బాగా బాధ, ఆవేదన కలిగించనది మీ లైఫ్‌లో ఏదైనా ఉందా?

నాగచైతన్య నా నుంచి విడిపోయినప్పుడు బాధగా ఉండేది. అలాగే, మద్రాస్‌లో చదువుకోవడానికి అతను వచ్చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను.


మీకు మిగిలి ఉన్న కోరిక ఏమిటి?

ఏమీ లేదండి. అయితే, అన్నపూర్ణ స్టూడియోస్‌ను అభివృద్ధి చేయాలి. నాకు ట్రస్టులు పెట్టడంపైనా, ప్రభుత్వ నిబంధనల మీదా నమ్మకం లేదు. నా ఒక్కో సినిమాకు ఇంతని తీసి కొందరు పిల్లలను చదివించడం లాంటివి అమలే చేస్తుంటుంది. మేమూ బాగానే ఖర్చు చేస్తున్నాం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

సినీ ప్రముఖులుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.