ఈ ఏడాది సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ వెలవెలబోయింది. కరోనా కారణంగా థియేటర్లు బంద్ అయిపోయాయి. అన్‌లాక్ తర్వాత థియేటర్లకు అనుమతి లభించినప్పటికీ ప్రేక్షకులు వస్తారా? రారా? అనే అనుమానంతో నిర్మాతలు సినిమాలు విడుదల చేయడం లేదు.
వచ్చే సంక్రాంతికి మాత్రం సినిమాలు భారీగా విడుదల కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే రెండు సినిమాలు మినహా మిగిలిన సినిమాలేవీ బరిలోకి దిగే సూచనలు కనిపించడం లేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవడం కష్టమనే భావనతో చాలా మంది నిర్మాతలు ముందుకు రావడం లేదట. ఈ కారణంతోనే సంక్రాంతికి రావాల్సిన నాగచైతన్య `లవ్‌స్టోరీ` వేసవికి వాయిదా పడిందట. అలాగే అక్కినేని అఖిల్ `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` విడుదలను కూడా వాయిదా వేయాలని అల్లు అరవింద్ అనుకుంటున్నారట. నితిన్ `రంగ్ దే` ఫిబ్రవరిలో విడుదల కాబోతోందట.