Bharat Chhodo : బిహార్ నుంచి కొత్త నినాదం మొదలైంది : అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2022-08-09T23:12:54+05:30 IST

బిహార్‌లో నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ

Bharat Chhodo : బిహార్ నుంచి కొత్త నినాదం మొదలైంది : అఖిలేశ్ యాదవ్

లక్నో : బిహార్‌లో నితీశ్ కుమార్ (Nitish Kumar) నేతృత్వంలోని జేడీయూ (JDU), లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ (RJD) జట్టు కట్టడాన్ని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) స్వాగతించారు. ఇది మంచి ప్రారంభమని వ్యాఖ్యానించారు. త్వరలోనే మరిన్ని రాజకీయ పార్టీలు కాషాయ శిబిరానికి వ్యతిరేకంగా ఏకమవుతాయని మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. 


1942లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ‘భారత్‌ను వదిలిపొండి’ (Quit India) ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు అలాంటి ఉద్యమం బీజేపీకి వ్యతిరేకంగా బిహార్‌లో ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, నాయకులు కూడా ఇదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తుతారని చెప్పారు. 


ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి వైదొలగి, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. బిహార్ గవర్నర్ ఫగు చౌహాన్‌కు తన రాజీనామాను సమర్పించి, ఆర్జేడీ, జేడీయూ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలని జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిపారు. 


Updated Date - 2022-08-09T23:12:54+05:30 IST