ఆ మాజీ సీఎం కుమార్తె మార్కులు చూస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే!

ABN , First Publish Date - 2020-07-12T11:55:23+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పెద్ద కుమార్తె అదితి 12 వ త‌ర‌గ‌తి బోర్డు పరీక్ష(సీఐఎస్‌సీఈ)ల్లో 98 శాతం మార్కులు సాధించింది. అఖిలేష్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్విట్టర్‌లో...

ఆ మాజీ సీఎం కుమార్తె మార్కులు చూస్తే దిమ్మ‌తిరిగిపోవాల్సిందే!

ల‌క్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పెద్ద కుమార్తె అదితి 12 వ త‌ర‌గ‌తి బోర్డు పరీక్ష(సీఐఎస్‌సీఈ)ల్లో 98 శాతం మార్కులు సాధించింది. అఖిలేష్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్విట్టర్‌లో తెలియ‌జేశారు. అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ దంప‌తుల‌కు అర్జున్ యాదవ్ అనే కుమారుడు, అదితి యాదవ్, టీనా యాదవ్ అనే ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. టీనా, అర్జున్ కవలలు. ఈ సంవత్సరం అదితి 12 వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. అదితి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తల్లి డింపుల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త‌న కుమార్తె అదితికి బ్యాడ్మింటన్ అంటే ఇష్టమ‌ని పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-12T11:55:23+05:30 IST