లోక్‌సభ ఎంపీ పదవికి అఖిలేష్ రాజీనామా

ABN , First Publish Date - 2022-03-22T20:06:05+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్‌సభ..

లోక్‌సభ ఎంపీ పదవికి అఖిలేష్ రాజీనామా

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి మంగళవారంనాడు రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను పార్లమెంటు కాంప్లెక్స్‌లో కలుసుకుని తన రాజీనామా పత్రాన్ని అందేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అజాంగఢ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. ఇటీవల యూపీలోని కర్హాల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి కూడా అఖిలేష్ గెలుపొందడంతో ఆ సీటును ఉంచుకుని, లోక్‌సభ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు.


కర్హాల్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి అఖిలేష్ 67,504 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 1,48,196 ఓట్లు పోల్ కాగా, ఆయనపై బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన కేంద్ర మంత్రి ఎస్‌పీ సింగ్ బఘెల్ కేవలం 80,692 ఓట్లు పొంది, ఓటమిని చవిచూశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అఖిలేష్‌కు ఇదే ప్రథమం. గతంలో ముఖ్యమంత్రిగా అఖిలేష్ పనిచేసినప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగానే ఉన్నారు.రు.


అజాంఖాన్ సైతం...

కాగా, జైలులో ఉంటూనే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్టుపై రాంపూర్ నియోజవర్గంలో పోటీ చేసి గెలుపొందిన అజాంఖాన్ సైతం తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Updated Date - 2022-03-22T20:06:05+05:30 IST