లక్నో: హోరాహోరా ఎన్నికల పోరు తర్వాత యూపీలో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి ఏర్పాటు కావడం, వెనువెంటనే అసెంబ్లీ సమావేశాలు మొదలుకావడంతో అందరి చూపూ సభాసమావేశాలపైనే ఉంది. ఇందుకు తగినట్టుగానే అఖిలేష్ మంగళవారం తన తొలిరోజు ప్రసంగంలో కాస్తంత 'హ్యూమర్' జోడించారు. స్పీకర్‌కు స్వాగతం పలుకుతూనే అన్యాపదేశంగా యోగి సర్కార్‌పై విసుర్లు విసిరారు.
ఇవి కూడా చదవండి
కొత్తగా ఎన్నికైన స్పీకర్ సతీష్ మహానకు అఖిలేష్ స్వాగతం పలుకుతూ హిందీలో ప్రసంగం సాగించారు. ''ఎన్నికైన ప్రభుత్వం నియంతలా వ్యవహరించకుండా మీరు (స్పీకర్) చూస్తారని ఆశిస్తున్నాను. మీరు విపక్షాల మాటను కూడా వినాలి'' అని కోరారు. అఖిలేష్ విదేశీ పర్యటనలపై యోగి సర్కార్ అడపాదడపా చేసే విమర్శలను పరోక్షంగా అఖిలేష్ ప్రస్తావిస్తూ...''నేను విదేశాలకు వెళ్లాను. అలా వెళ్లకుండా ఉండి ఉంటే లక్నోకు ఎక్స్‌ప్రెస్‌వే కానీ, కాన్పూర్ మెట్రోను కానీ సమాజ్ వాదీ పార్టీ తెచ్చి ఉండేది కాదు'' అని అన్నారు. అఖిలేష్ ప్రసంగించినప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో కొద్దిసేపు అహ్లాదకర వాతావరణం కనిపించింది.