లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)-రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ(Rashtriya Lok Dal)ల ఉమ్మడి రాజ్యసభ(Rajya Sabha) అభ్యర్థి(candidate)గా జయంత్ చౌదరి(Jayant Chaudhary) పేరు ఖరారైంది. తన భార్య డింపుల్ యాదవ్‌ని కాదని జయంత్ పేరు(Dimple Yadav)ను ఖరారు చేశారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav). ఇప్పటికే పార్టీ నుంచి కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబాల్, జవేద్ అలీ ఖాన్ పేర్లు ఖరారు అయ్యాయి. కాగా చివరి అభ్యర్థిగా ఆర్ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరి పేరును ఫైనల్ చేశారు.
వాస్తవానికి రాజ్యసభకు వెళ్లే అంశంపై జయంత్‌కు ముందస్తుగా ఎలాంటి ఆలోచనలు లేవు. తాను ఆ రేసులో లేనని బుధవారం జయంత్ చౌదరి ఒక సందేశం కూడా పంపారు. అయితే గురువారం ఉదయం జయంత్‌కు అఖిలేష్ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారట. అయితే సమాజ్‌వాదీ పార్టీ పేరుతోనే రాజ్యసభకు జయంత్‌ను పంపాలని అఖిలేష్ భావిస్తున్నారట. కానీ ఎస్పీ మద్దతుతో ఆర్ఎల్‌డీ సభ్యుడిగానే రాజ్యసభకు వెళ్లాలని జయంత్ యోచిస్తున్నారట. జయంత్ రాజ్యసభ సభ్యత్వం దాదాపుగా ఖరారు అయినట్టే కానీ, ఏ పార్టీ పేరుతో వెళ్తారనేదానికి ఇంకా సమయం పట్టొచ్చని ఇరు పార్టీల నేతలు అంటున్నారు.
ఇవి కూడా చదవండి