Abn logo
Apr 8 2021 @ 15:03PM

బెదిరిస్తూ వైసీపీ ఓట్లు వేయించుకుంటోంది: అఖిల ప్రియ

కర్నూలు జిల్లా: కేసులు పెడతామని బెదిరిస్తూ వైసీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటోందని టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఓట్లు లేని వ్యక్తులు బాచేపల్లి గ్రామంలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వన్ సైడ్ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేస్తున్న వైసీపీ వాళ్ళను పోలీసులు ఎందుకు కట్టడి చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. అనవసరంగా రెచ్చగొడుతున్నారని, మమ్మల్ని భయపెట్టాలని చూస్తే రెట్టింపుగా స్పందించాల్సి వస్తుందని అఖిల ప్రియ హెచ్చరించారు.

Advertisement
Advertisement
Advertisement