Abn logo
Aug 5 2020 @ 17:31PM

అఖిల్ ఫ్లాప్ సినిమా అక్కడ రికార్డులు సృష్టిస్తోంది!

దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన భారీ ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఇక్కడి ఫ్లాప్ సినిమాల డబ్బింగ్ వెర్షన్‌లు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి  అక్కినేని అఖిల్ నటించిన `మిస్టర్ మజ్ను` కూడా చేరింది. ఈ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 


అఖిల్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందించిన సినిమా `మిస్టర్ మజ్ను`. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పరాజయంగా నిలిచింది. ఇటీవల ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్‌లో విడుదల చేశారు. అప్‌లోడ్ చేసిన 40 గంటల్లోపే ఈ సినిమా 20 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇక, నెల రోజుల్లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ తెచ్చుకోవడం పాటు 1.3 మిలియన్ లైక్స్ కూడా సాధించింది. `సవ్యసాచి`, `ఛల్ మోహన రంగా`, `శ్రీనివాస కల్యాణం`, `డీజే`, `జయ జానకీ నాయక` వంటి ఎన్నో సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌లు యూట్యూబ్‌లో వంద మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement