Abn logo
Apr 8 2021 @ 11:58AM

'ఏజెంట్‌'గా అఖిల్..లుక్ అదిరిపోయింది..!

అఖిల్ అక్కినేని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన 5వ సినిమాని చేయబోతున్న విషయం తెలిసిందే.. నేడు అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు అఖిల్ లుక్‌ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. అఖిల్‌కి ఎలాంటి సినిమా పడాలో ఖచ్చితంగా అలాంటి సినిమానే సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడని తాజాగా వదిలిన అఖిల్ ఏజెంట్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. అఖిల్ కోసం సురేందర్ రెడ్డి కిక్, రేసుగుర్రం వంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశాన్ని సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేసిన అఖిల్ మొదటిసారి యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ఇక తాజాగా చిత్ర యూనిట్ వదిలిన టైటిల్ అండ్ పోస్టర్‌కి అభిమానులు.. ప్రేక్షకులు .. ఇండస్ట్రీ వర్గాల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. 

ఒకరకంగా సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాని హాలీవుడ్ సినిమా తరహాలో తెరకెక్కించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాని అనిల్ సుంకర- ఎకె ఎంటర్ టైన్మెంట్స్ - సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఏజెంట్  రెగ్యులర్ షూట్ ఈ నెల 11 నుండి ప్రారంభమవుతుందట. 2021 డిసెంబర్ 24 న ఏజెంట్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. కాగా అఖిల్ - పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ జూన్ 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా అఖిల్ - పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ జూన్ 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 


Advertisement
Advertisement
Advertisement