Abn logo
Aug 1 2020 @ 14:55PM

గోపీచంద్‌తో అఖిల్ హీరోయిన్..?

గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో ‘ఆలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ‌’ అనే చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో గోపీచంద్ స‌ర‌స‌న కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టించ‌నున్నార‌ని వార్త‌లు వినిపించాయి. తాజాగా మ‌రో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె ఎవ‌రో కాదు.. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌. అయితే ఈమె రెండో హీరోయిన్‌గానే న‌టిస్తుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అఖిల్‌తో  ‘హ‌లో’, శ‌ర్వానంద్‌తో ‘ర‌ణ‌రంగం’ సినిమాల్లో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఈమెకు తెలుగులో హీరోయిన్‌గా అనుకున్నంత బ్రేక్ ద‌క్క‌లేదు. మ‌రి తేజ అయినా క‌ల్యాణికి బ్రేక్ ఇస్తారేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement