Abn logo
Sep 21 2021 @ 01:24AM

అఖాడా పరిషత్‌ చీఫ్‌ నరేంద్ర గిరి ఆత్మహత్య

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ చీఫ్‌ నరేంద్ర గిరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని సొంత నివాసంలో నరేంద్ర గిరి సోమవారం బలవన్మరణానికి పాల్పడడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు వివరాలు చెప్పారు. నరేంద్ర గిరి ఇంట్లో ఆత్మహత్య లేఖ కూడా లభ్యమైందన్నారు.