ఆక్వా అథారిటీని వేగవంతం చేయాలి: జేసీ

ABN , First Publish Date - 2021-02-25T06:54:00+05:30 IST

ఆక్వా అథారిటికి, చెరువుల తవ్వకాలకు అనుమతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులను నిబంధనలకు అనుగునంగా పరిశీలించాలని జేసీ లక్ష్మీశ అధికారులకు సూచించారు.

ఆక్వా అథారిటీని వేగవంతం చేయాలి: జేసీ

తాళ్లరేవు, ఫిబ్రవరి 24: ఆక్వా అథారిటికి, చెరువుల తవ్వకాలకు అనుమతుల కోసం పెట్టుకున్న దరఖాస్తులను నిబంధనలకు అనుగునంగా పరిశీలించాలని జేసీ లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆక్వా అథారిటీ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.  సమీక్షలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మత్స్యశాఖ, గ్రామీణనీటిసరఫరా, వ్యవసాయంశాఖ అధికారులు పాల్గొన్నారు.  సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అన్నిశాఖల విధి విధానాలపై అగాహన కలిగి ఉండాలని జేసీ లక్ష్మీశ అన్నారు. బుధవారం తాళ్లరేవు గ్రామ సచివాలయాన్ని ఆయన సందర్శించి  సచివాలయ ఉద్యోగుల పనితీరు, రికార్డులను పరిశీలించారు.  ప్రజలు సచివాలయానికి వచ్చి ఎటువంటి సేవలు గురించి అడిగినా ప్రతీ అధికారి చెప్పాల్సిందే, నాపరిధి కాదని  అంటే సరికాదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జి.చినబాబు, ఎంపీడీవో పి.విజయధామస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T06:54:00+05:30 IST