బీర్బల్‌ ఛాయిస్‌!

ABN , First Publish Date - 2020-06-14T05:30:00+05:30 IST

ఒకరోజు అక్బర్‌ మహారాజు బీర్బల్‌తో....‘బీర్బల్‌! నీకు ఒక బంగారు నాణెం, న్యాయం ఇస్తే, రెండింటిలో ఏది ఎంచుకుంటావు?’ అని ప్రశ్నించాడు. అందుకు బీర్బల్‌ ఏమాత్రం తడుముకోకుండా ‘బంగారు నాణెం’ అని సమాధానమిచ్చాడు...

బీర్బల్‌ ఛాయిస్‌!

ఒకరోజు అక్బర్‌ మహారాజు బీర్బల్‌తో....‘బీర్బల్‌! నీకు ఒక బంగారు నాణెం, న్యాయం ఇస్తే, రెండింటిలో ఏది ఎంచుకుంటావు?’ అని ప్రశ్నించాడు. అందుకు బీర్బల్‌ ఏమాత్రం తడుముకోకుండా ‘బంగారు నాణెం’ అని సమాధానమిచ్చాడు. ఆ సమాధానం విని అక్బర్‌ ఆశ్చర్యపోయాడు. వెంటనే ‘న్యాయం కన్నా నీకు బంగారు నాణెం ఎక్కువా?’ అని ప్రశ్నించాడు అక్బర్‌. ‘అవును జహాపనా!’ అన్నాడు బీర్బల్‌.


ఆ సమాధానంతో సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ‘మా దగ్గర పనిచేసే వాళ్లలో ఎవరు ఈ సమాధానం  చెప్పినా నేను ఆశ్చర్యపోయే వాణ్ణి కాదు. కానీ నువ్వు చెప్పడం నేను నమ్మలేకపోతున్నాను’ అన్నాడు అక్బర్‌. బీర్బల్‌ అందుకు సమాధానంగా ‘జహాపనా! ఎవరైనా వాళ్ల దగ్గర లేని దాన్నే కావాలని కోరుకుంటారు కదా! ఈ రాజ్యంలో అందరికీ న్యాయం అందుబాటులో ఉంది. నాకు కూడా న్యాయం అందుబాటులో ఉంది. కానీ నా దగ్గర ఎప్పుడూ డబ్బుకు లోటే ఉంటుంది. అందుకే బంగారు నాణెం ఎంచుకున్నాను’ అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విన్న అక్బర్‌ ఎంతో సంతోషించి, బీర్బల్‌కు వెయ్యి బంగారు నాణేలు ఇచ్చి సత్కరించాడు. 


Updated Date - 2020-06-14T05:30:00+05:30 IST