Sep 23 2021 @ 08:39AM

'ఆకాశవాణి': సెన్సార్ పూర్తి విడుదలకి సిద్ధం..

దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతు రూపొందించిన చిత్రం 'ఆకాశవాణి'. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ పూర్తయ్యాయి. ఇందులో విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ మ్యూజిక్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 


విలేజ్ డ్రామాగా రూపొందించిన 'ఆకాశవాణి' చిత్రానికి సన్సార్ వారు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. క్రూరమైన భూస్వామికి వ్యతిరేకంగా గిరిజనులు చేస్తున్న పోరాటాన్ని కొత్త నటీనటులతో తెరకెక్కించారు. రేడియో ట్రాన్సిస్టర్ ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. కొద్ది రోజుల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆకాశవాణి' చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం సోనీ లివ్‌లో ఈ రోజు (సెప్టెంబర్ 23) రాత్రి నుంచే మూవీ స్ట్రీమింగ్ కానుంది.