Jul 25 2021 @ 11:28AM

ఆకాష్ పూరీ 'చోర్ బజార్' ఫస్ట్ లుక్ రిలీజ్

డేరింగ్ అండ్ డాషిన్ డైరెక్తర్ పూరిజగన్నాథ్ కొడు ఆకాష్ పూరి నటిస్తున్న లేటెస్ట్ మువీ 'చోర్ బజార్'. తాజాగా దీని నుంచి ఫస్ట్ లుక్ లాంచ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దళం, జార్జ్ రెడ్డి ఫేమ్మ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, గెహన సిప్పీ ఆకాష్‌కి జంటగా నటిస్తోంది. నేడు ( జూలై 25 ) ఈ యంగ్ హీరో బర్త్ డే సందర్భంగా 'చోర్ బజార్' మూవీ నుంచి తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్‌కి తగ్గట్టే ఆకాష్ చాలా పవర్‌ఫుల్‌గా.. ఇంటెన్సివ్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో శరవేగంగాసాగుతుంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మిస్తున్నాడు. కాగా ఆకాష్ నటించిన 'రొమాంటిక్' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.