చైనాతో పోరుకు సూర్యలంకలో ట్రయల్స్‌

ABN , First Publish Date - 2020-12-05T07:49:59+05:30 IST

తూర్పు లద్ధాఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరుసగా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తూ వాయుసేనను బలోపేతం చేస్తోంది...

చైనాతో పోరుకు సూర్యలంకలో ట్రయల్స్‌

  • 10 ఆకాశ్‌ క్షిపణి ప్రయోగాలు విజయవంతం 

న్యూఢిల్లీ, డిసెంబరు 4: తూర్పు లద్ధాఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరుసగా క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తూ వాయుసేనను బలోపేతం చేస్తోంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌ దేశానికి దీటుగా బదులివ్వడానికి దేశీయంగా రూపొందించిన ‘ఆకాశ్‌’ క్షిపణి ప్రయోగాలను భారత వైమానిక దళం ఇటీవల విజయవంతంగా నిర్వహించింది. కంబైన్డ్‌ గైడెడ్‌ వెపన్స్‌ ఫైరింగ్‌-2020లో భాగంగా ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో గతవారం నిర్వహించిన 10 ప్రయోగాల్లో చాలావరకూ క్షిపణులు నేరుగా లక్ష్యాన్ని ఛేదించాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో ఆకాశ్‌తో పాటు రష్యాకు చెందిన ఇగాలా క్షిపణి వ్యవస్థనూ ఐఏఎఫ్‌ పరీక్షించింది. నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించే శ త్రు దేశాల యుద్ధ విమానాలను నింగిలోనే గుర్తించి వందల కిలోమీటర్ల దూరంలో నే మట్టికరిపించడం ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశం. కాగా, చైనా దాడులను తిప్పికొట్టేందుకు భారత్‌ తూర్పు లద్ధాఖ్‌లోనూ ఈ రెండు క్షిపణి వ్యవస్థలను మోహరించింది. 


Updated Date - 2020-12-05T07:49:59+05:30 IST