ధోనీకి డీఆర్‌ఎస్‌ నచ్చదు

ABN , First Publish Date - 2020-07-01T08:50:38+05:30 IST

ఇప్పుడంటే అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్దతి (డీఆర్‌ఎ్‌స)పై భారత్‌ ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు కానీ.. ఆరంభంలో మాత్రం దీనిని వాడేందుకు

ధోనీకి డీఆర్‌ఎస్‌ నచ్చదు

ఆకాశ్‌ చోప్రా

న్యూఢిల్లీ: ఇప్పుడంటే అంపైర్‌ నిర్ణయ సమీక్ష పద్దతి (డీఆర్‌ఎ్‌స)పై భారత్‌ ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు కానీ.. ఆరంభంలో మాత్రం దీనిని వాడేందుకు ఇష్టపడలేదు.    డీఆర్‌ఎ్‌సపై అప్పటి కెప్టెన్‌ ధోనీకి నమ్మకం ఉండకపోవడమే దీనికి కారణమని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు. ‘కుంబ్లే కెప్టెన్సీలో భారత్‌ అందరికన్నా ముందే 2008లో శ్రీలంకపై డీఆర్‌ఎ్‌సను ఉపయోగించింది. కానీ ఆ మ్యాచ్‌లో సరైన నిర్ణయాలు రాలేదు. అది కొత్త పద్దతి కాబట్టి ఎలా వినియోగించుకోవాలో మనకు అర్థం కాలేదు. అందుకే భారత్‌ ఇష్టపడలేదు. అదీ కాకుండా డీఆర్‌ఎస్‌ అంటే ధోనీకి పెద్దగా ఇష్టం లేదు. అతడు కెప్టెన్‌ అయ్యాక టీమిండియా ఈ పద్దతికి దూరంగానే ఉంది. అయితే కెప్టెన్‌ కోహ్లీ డీఆర్‌ఎ్‌సకు అభిమాని కావడంతో ప్రస్తుతం భారత మ్యాచ్‌ల్లోనూ ఈ పద్దతి కనిపిస్తోంది. కానీ ధోనీకి డీఆర్‌ఎ్‌సపై ఎంత వ్యతిరేకత ఉన్నా అతడు వికెట్ల వెనకాల నుంచి సిగ్నల్‌ ఇచ్చాడంటే అది కచ్చితంగా అవుట్‌ అయినట్టే. అందుకే దీన్ని ధోనీ రివ్యూ సిస్టమ్‌ అని కూడా అభిమానులు పిలుచుకుంటారు’ అని చోప్రా తెలిపాడు.

Updated Date - 2020-07-01T08:50:38+05:30 IST