గుడ్ న్యూస్ : Akasa Air బుకింగ్స్ స్టార్ట్

ABN , First Publish Date - 2022-07-22T18:26:55+05:30 IST

సామాన్య ప్రజానీకం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆకాశ ఎయిర్ గగనతలంలో విహరించేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంది.

గుడ్ న్యూస్ : Akasa Air బుకింగ్స్ స్టార్ట్

Akasa Air : సామాన్య ప్రజానీకం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆకాశ ఎయిర్ గగనతలంలో విహరించేందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంది. అత్యంత చవకగా విమానయానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే తలంపుతో బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala) మరికొందరితో కలిసి ఈ ఆకాశ ఎయిర్‌ను ప్రారంభించారు. దీనికోసం బోయింగ్ 737 మ్యాక్స్(Boeing 737 Max) విమానాలను కొనుగోలు చేసింది. ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్(Mumbai-Ahmedabad) రూట్‌లో తన మొదటి సర్వీసును విహరింపజేయనుంది.


ఆకాశ ఎయిర్ తొలి సర్వీస్ ఆగస్ట్ 7న ప్రారంభం కానుంది. దీంతో తమ వాణిజ్య విమాన కార్యకలాపాలు మొదలవుతాయని కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ శుక్రవారం తెలిపింది. ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్‌లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి(Bengaluru-Kochi) రూట్‌లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఎయిర్‌లైన్ క్యారియర్ తెలిపింది. బోయింగ్ ఒక మాక్స్ విమానాన్ని ఇప్పటికే డెలివరీ చేసింది. రెండోది ఈ నెలాఖరులో డెలివరీ చేయనుంది. ‘‘మేము సరికొత్త బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ముంబై - అహ్మదాబాద్ మధ్య విమానాలతో కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాం’’ అని ఆకాసా ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్(Praveen Ayyar) వెల్లడించారు. 


ఆకాశ ఎయిర్‌లైన్స్ దశవాలరీగా తమ నెట్‌వర్క్‌(Network)ను విస్తరించనుంది. క్రమంగా మరిన్ని నగరాలకు సేవలు అందిస్తామని తెలిపింది. మొదటి సంవత్సరంలో ప్రతి నెలా రెండు విమానాలు యాడ్ అవుతాయని ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. ఆకాశ ఎయిర్‌లైన్స్ క్యారియర్ జూలై 7న ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుంచి దాని ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (AOC) పొందింది. ఆగస్టు 2021లో డీజీసీఏ మాక్స్ విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Updated Date - 2022-07-22T18:26:55+05:30 IST