బీజేపీలో చేరిన అకాలీదళ్ నేత మాజిందర్ సింగ్

ABN , First Publish Date - 2021-12-02T00:20:26+05:30 IST

పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఒక వైపు కాంగ్రెస్, మరొకవైపు అకాలీ-బీఎస్‌పీ కూటమి హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే ఈ ఇరు పార్టీలతో పాటు ఆప్, బీజేపీలు కూడా గట్టిపోటీని ఇచ్చేందుకు..

బీజేపీలో చేరిన అకాలీదళ్ నేత మాజిందర్ సింగ్

చండీగఢ్: పంజాబ్‌లో ఎలాగైనా ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతున్న అకాలీదళ్ పార్టీకి కొంత మేరకు నష్టం జరిగింది. ఆ పార్టీకి చెందిన మాజిందర్ సింగ్ అనే నేత తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. అకాలీదళ్‌కు రాజీనామా చేసిన కొద్ది సమయానికే ఆయన బీజేపీలో చేరడం గమనార్హం. అయితే అకాలీ నుంచి నిష్క్రమించడానికి గల కారణాలను ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొనలేదు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అకాలీకి రాజీనామా చేసిన కొద్ది సమయానికే కమల కండువా కప్పుకోవడం పట్ల రాజకీయపరమైన బలమైన కారణాలు ఉండి ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.


పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఒక వైపు కాంగ్రెస్, మరొకవైపు అకాలీ-బీఎస్‌పీ కూటమి హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే ఈ ఇరు పార్టీలతో పాటు ఆప్, బీజేపీలు కూడా గట్టిపోటీని ఇచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా సొంత పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంత మంది పోటీలో ఉన్నా.. ప్రధాన పోటీ కాంగ్రెస్-అకాలీ మధ్యనే అని చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-12-02T00:20:26+05:30 IST