హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-16T21:07:49+05:30 IST

శిరోమణి అకాలీదళ్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌ కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్ప కొవిడ్ ..

హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: శిరోమణి అకాలీదళ్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్‌ కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్ప కొవిడ్ లక్షణాలు ఉండడంతో ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్టు ఆమె ఇవాళ ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు ఇవాళ వైద్య పరీక్షల్లో తేలింది. స్వల్ప లక్షణాలు కన్పిస్తుండడంతో నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇటీవల కాలంలో నాకు సమీపంగా మెలిగిన వారంతా ఐసొలేట్ అవ్వాలనీ.. సాధ్యమైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను..’’ అని బాదల్ పేర్కొన్నారు. కాగా శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2.17 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజాగా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,42,91,917కి చేరింది. ప్రస్తుతం 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-04-16T21:07:49+05:30 IST