పంజాబ్: అసెంబ్లీ నుంచి అకాలీదళ్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ABN , First Publish Date - 2021-03-05T23:52:50+05:30 IST

గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణం అంశంపై ముఖ్యమంత్రి అమరీందర్ సభలో మాట్లాడుతుండగా శిరోమణి అకాలీదళ్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. వారికి నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం విఫలం

పంజాబ్: అసెంబ్లీ నుంచి అకాలీదళ్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ నుంచి శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ప్రస్తుతం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరిపై సస్పెన్షన్ ఉంటుందని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాలకు అంతరాయం కలిగిస్తున్న కారణంగా వీరిని సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. సభలో నిరసన చేస్తున్న వీరిని స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ బయటికి బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం సభ కొనసాగింది.


గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణం అంశంపై ముఖ్యమంత్రి అమరీందర్ సభలో మాట్లాడుతుండగా శిరోమణి అకాలీదళ్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. వారికి నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం విఫలం కావడంతో స్పీకర్ రానా కేపీ సింగ్, సభను రెండు సార్లు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమయ్యాక కూడా అదే తంతు కొనసాగడంతో అకాలీదళ్ ఎమ్మెల్యేలు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ఆదేశాల మేరకు అకాలీదళ్ ఎమ్మెల్యేలను మార్షల్ బలవంతంగా సభా బయటకు తీసుకెళ్లారు.

Updated Date - 2021-03-05T23:52:50+05:30 IST