కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు అజిత్ కుమార్. అతడు హీరోగా తెరకెక్కిన చిత్రం వాలిమై. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబొతుంది. తెలుగులోను బలం పేరుతో అనువాదమవుతోంది. ఈ చిత్ర ట్రైలర్ డిసెంబర్ 30న విడుదల అయింది.
ట్రైలర్లో అజిత్ బైక్ స్టంట్స్‌తో అదర గొట్టారు. హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్‌తో అభిమానులను అబ్బుర పరిచారు. ఆ సీన్స్‌కు అభిమానూలందరూ ఫిదా అయ్యారు. ట్రైలర్ విడుదల కావడంతోనే వాలిమై హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్లో అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. వేలాది ట్వీట్లతో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు.
వాలిమై సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌తో కలిసి సంయుక్తంగా బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో అజిత్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. టాలీవుడ్ నటుడు కార్తికేయ గుమ్మకొండ విలన్ పాత్రను పోషిస్తున్నారు. నెర్కొండ పావై అనంతరం అజిత్ చేస్తున్న చిత్రం ఇదే కావడంతో దీనిపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, సుమిత్ర, యోగి బాబు, రాజ్ అయ్యప్ప, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించారు. సినీమాటోగ్రాఫర్ గా నీరవ్ షా వ్యవహరించారు.