Sep 22 2021 @ 12:58PM

సంక్రాంతి బరిలో అజిత్ 'వలిమై'

తమిళ స్టార్ థలా అజిత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వలిమై'. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగబోతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని హెచ్. వినోద్ రూపొందిస్తున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ మూవి ట్రైలర్ విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే మేకర్స్ 'వలిమై' చిత్రానికి సంబంధించి సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. వాస్తవంగా ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే త్వరలో ట్రైలర్, రిలీజ్ డేట్‌ను వదలబోతున్నటు తెలుస్తోంది. దీనిని బాలీవుడ్ స్టార్ మేకర్ బోనీకపూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 


Otherwoodsమరిన్ని...