Oct 30 2020 @ 13:37PM

సినిమా కోసం బరువు తగ్గిన అజిత్‌..!

లేటెస్ట్‌ మూవీ ‘వలిమై’ చిత్రం కోసం కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ బరువు తగ్గారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అజిత్‌ లేటెస్ట్‌ లుక్‌ చూసిన ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. నటుడు అజిత్‌ 60వ చిత్రం ‘వలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్‌ నిర్మిస్తున్నాడు. యాక్షన్‌ చిత్రంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆరు నెలలుగా నిలిచిపోయిన చిత్రం షూటింగ్‌ గత నెల చెన్నైలో ప్రారంభమైంది. అజిత్‌ మినహా ఇతర నటీనటులు పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ప్రస్తుతం చిత్రం తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. చిత్ర కథలోని పాత్ర కోసం లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో వ్యాయామం చేసిన అజిత్‌ బరువు తగ్గారు.