Abn logo
May 23 2020 @ 09:14AM

హాస్పిట‌ల్‌కు వెళ్లిన అజిత్, షాలిని

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అజిత్ భార్య షాలినితో క‌లిసి చెన్నైలోని ఓ హాస్పిట‌ల్‌కు వెళ్లారు. వీరిద్ద‌రూ మాస్కులు ధ‌రించి హాస్పిట‌ల్ వెళ్లిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. అజిత్ తండ్రి అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నార‌ని, ఆయ‌న కోస‌మే అజిత్‌, షాలిని హాస్పిట‌ల్‌కు వ‌చ్చార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ విష‌యంపై అజిత్ వ‌ర్గం నుండి ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు. అజిత్ ప్ర‌స్తుతం వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌లిమై సినిమాలో న‌టిస్తున్నారు. బోనీక‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement