Abn logo
Aug 2 2020 @ 03:18AM

రాష్ట్ర విజయాల్లో అజయ్‌మిశ్రా కృషి

  •  ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సాధించిన అద్భుత విజయాల్లో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజయ్‌మిశ్రా కృషి ఎంతో ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు కొనియాడారు. ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు మధ్య వారధిగా ఉంటూ ఎంతో సహనం, సమన్వయం, సమయ స్పూర్తితో బాధ్యతలు నెరవేర్చారని పేర్కొ న్నారు. పదవీ విరమణ చేసిన అజయ్‌మిశ్రాకు ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో విద్యుత్తుసౌధలో శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు.   

Advertisement
Advertisement
Advertisement