ఆకట్టుకుంటోన్న ‘అజగజాంతరం’ మలయాళ మూవీ ట్రైలర్

‘అంగమాలి డైరీస్ (తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్’‌గా రీమేక్ అయింది.), జల్లికట్టు’ లాంటి సినిమాలతో మాలీవుడ్ లో క్రేజీ హీరో అనిపించుకున్నారు ఆంటోనీ వర్గీస్.  తాజాగా ఆయన నటించిన యాక్షన్ చిత్రం ‘అజగజాంతరం’. టిను పప్పచ్చన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఇమ్మాన్యుయేల్ జోసెఫ్, అజిత్ తల్లపిల్లి సంయుక్తంగా నిర్మించారు. చెంబన్ వినోద్ జోస్, సాబూమోన్ అబ్దుల్ సమద్, అర్జున్ అశోకన్, లుక్ మాన్, జాఫర్ ఇడుక్కి, సుధీ కొప్ప ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. గ్రామీణ నేపథ్యం కలిగిన రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 


అద్భుతమైన మేకింగ్‌తో సహజసిద్ధమైన యాక్షన్ సీక్వెన్సెస్ తో ఆకట్టుకుంటోంది ట్రైలర్. ఒక దేవాలయానికి సంబంధించిన జాతర ఉత్సవాల్లో .. రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే పోరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఉత్సవం జరిగే సమయంలో దేవాలయ ప్రాంగణంలోకి ఏనుగుతో పాటు మావటి, ఇతర సిబ్బంది అడుగుపెడతారు. 24 గంటల్లో అక్కడ జరిగే అనూహ్య సంఘటనలు, దాని వల్ల జరిగే పరిణామాలు ఏంటన్నదే ఈ సినిమా కథాంశం. మావటి గా ఆంటోనీ వర్గీస్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా ఏరేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి. 


Advertisement