వందేళ్ల పోరాట చరిత్ర గల ఏఐటీయూసీ

ABN , First Publish Date - 2020-10-31T07:45:03+05:30 IST

ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఏర్పడి నేటితో వందేళ్లు అవుతున్నందున శతజయంతి ఉత్సవాలను కార్మిక వర్గం ఘనంగా జరుపుకోవాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న కోరారు

వందేళ్ల పోరాట చరిత్ర గల ఏఐటీయూసీ

పోస్టర్‌ ఆవిష్కరణలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న


నారాయణపేట, అక్టోబరు 30 : ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఏర్పడి నేటితో వందేళ్లు అవుతున్నందున శతజయంతి ఉత్సవాలను కార్మిక వర్గం ఘనంగా జరుపుకోవాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండన్న కోరారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్లుగా దేశంలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ శ్రామికులకు అండగా తమ సంఘం నిలుస్తోందన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు అమలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.అనంతరం శతజయంతి ఉత్సవాల కర పత్రాలను విడుదల చేశారు. సమావేశంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు రాము, బాలరాజు, తాయప్ప పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:45:03+05:30 IST