ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు

ABN , First Publish Date - 2021-02-27T05:59:11+05:30 IST

ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి తెలిపారు.

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు
శంకర్‌విలాస్‌ సెంటర్‌లో ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులు

ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి

గుంటూరు(సంగడిగుంట), ఫిబ్రవరి 26: ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ స్థానిక శంకర్‌విలాస్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి ఉధృతమైన ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు.  రాష్ట్రంలోని ఏకైక పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తూ ఆంధ్రుల పట్ల ద్రోహానికి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సొంత గనులు కేటాయించక పోవడమే విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలకు కారణమన్నారు. సుమారు 2 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కును కేవలం రూ.20 కోట్లకు అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కోట మాల్యాద్రి, నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల అంజిబాబు, ఆకిటి అరుణ్‌కుమార్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై నేతాజి, నగర కార్యదర్శి శ్రీనివాసరావు, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయకులు శ్రీధర్‌, నరసింహారావు, నిల్సన్‌,  మంగా శ్రీను, వలి, ధూపాటి వెంకటరత్నం, లక్ష్మణరావు, మనోజ్‌, ఎస్‌కే సైదా, పాశం రామారావు తదితరులు పాలొన్నారు.


 


Updated Date - 2021-02-27T05:59:11+05:30 IST