వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో రికార్డులకెక్కిన భారతీయ వనిత

ABN , First Publish Date - 2020-10-18T22:08:23+05:30 IST

ఐశ్వర్య శ్రీధర్.. 23 ఏళ్ల ఈ భారత యువతి ‘వైల్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల ఎంట్రీలు రాగా, అందులో ఐశ్వర్య తీసిన ఫొటో కూడా ఉంది. చివరికి 100 ఫొటోలను

వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో రికార్డులకెక్కిన భారతీయ వనిత

న్యూఢిల్లీ: ఐశ్వర్య శ్రీధర్.. 23 ఏళ్ల ఈ భారత యువతి ‘వైల్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల ఎంట్రీలు రాగా, అందులో ఐశ్వర్య  తీసిన ఫొటో కూడా ఉంది. చివరికి 100 ఫొటోలను ఎంపిక చేయగా, అందులో ‘అకశేరుకాల ప్రవర్తన’ కేటగిరీలో ఐశ్వర్య ఈ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ నెల 13న లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించారు. 




ఐశ్వర్య తన ఫొటోకు ‘లైట్స్ ఆఫ్ పాషన్’ అని పేరు పెట్టారు. అవార్డు తనకు దక్కడంపై ఐశ్వర్య ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. యువ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా తనకు, భారత్‌కు ఇది ఎంతో గర్వకారణమన్నారు. అడల్ట్ కేటగిరీలో ఇండియా నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి, యువ ఫొటోగ్రాఫర్‌ను తానేనని వివరించారు. ఈ అవార్డు తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. ఈ సందర్భంగా జ్యూరీలు, డబ్ల్యూపీవై బృందానికి ఐశ్వర్య కృతజ్ఞతలు తెలిపారు. 




ఐశ్వర్య శ్రీధర్ వృత్తిరీత్యా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, రైటర్, ఫిల్మ్ మేకర్. కన్జర్వేషనిస్ట్ కూడా. చిత్తడి నేలల పరిరక్షణ చర్యలకు గాను 2019లో ప్రిన్సెస్ డయానా చేతుల మీదుగా డయానా అవార్డు అందుకున్నారు. బాంబే హైకోర్టు నియమిత స్టేట్ వెట్‌ల్యాండ్ ఐటెండిఫికేషన్ కమిటీలో ఐశ్వర్య యువ సభ్యురాలు కూడా. 

Updated Date - 2020-10-18T22:08:23+05:30 IST