Oct 20 2021 @ 03:39AM

సూర్య, బాలా చిత్రంలో ఐశ్వర్యారాజేష్‌?

నటుడిగా, నిర్మాతగా వరుస చిత్రాలతో జోరు పెంచారు సూర్య. దర్శకులు శిరుతాయ్‌ శివ, బాలాతో ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. బాలాతో తీసే చిత్రంలో ఆయన కీలకపాత్రలో నటించడంతో పాటు తన 2డి బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథకు కీలకమైన హీరోయిన్‌ పాత్రకోసం ఐశ్వర్యారాజేష్‌ను బాలా ఎంపిక చేశారని కోలీవుడ్‌ సమాచారం. ఆమె పాత్ర కోసం  చెన్నైలో ఫొటో షూట్‌ కూడా నిర్వహించారని చెబుతున్నారు. ఇందులో ఆమె అథర్వకు జోడీగా కనిపించనున్నారు. జితన్‌ రమేష్‌ సరసన ఐశ్వర్య కథానాయికగా నటిస్తున్న చిత్రం ఇటీవలె ప్రారంభమైంది. సూర్య లాయర్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘జై భీమ్‌’ నుంచి ‘పవర్‌’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదలచేసింది.